Pegadapally | పెగడపల్లి: పెగడపల్లి మండలం నందగిరి గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల ఐకేపీ (సెర్ప్) సీసీ కొత్తూరి రవికుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మండలంలోని నామాపూర్ లో శుక్రవారం డీఆర్డీవో రఘువరన్ ఆయన కుటుంబ సభ్యులను పరమర్శించారు. అలాగే సీసీ రవికుమార్ మృత దేహంపై పూల మాలలు వేసి, అనంతరం గ్రామంలో నిర్వహించిన శవయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడుతూ సీసీ రవికుమార్ మృతి చెందడం చాలా బాధాకరమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అతడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా అన్ని ప్రయోజనాలను అతడి కుటుంబానికి కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, డీపీఎంలు రమేశ్, నారాయణ, నాగేశ్వర్ రావు, ఏపీఎంలు రవివర్మ, గంగాధర్, రాజయ్య, సమత, విమోచన, త్రివేణి, ఏపీవో అనిల్ కుమార్, సీసీలు దాస్, తిరుపతి, స్వామి, శశికుమార్, రాము, జిల్లా సెర్ఫ్ సిబ్బంది, వివోఏలు, ఈజిఎస్ ఎఫ్ఎలు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.