గ్రామాల అభివృద్ధిలో తెలంగాణ ఆదర్శం
‘పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. గ్రామాల అభివృద్ధి, పచ్చదనం పరిశుభ్రతలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దే’ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కొనియాడారు.
- సర్పంచులు, ఉప సర్పంచుల పనితీరు అభినందనీయం
- జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల, జనవరి 27: ‘పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. గ్రామాల అభివృద్ధి, పచ్చదనం పరిశుభ్రతలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దే’ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కొనియాడారు. సర్పంచుల, ఉప సర్పంచ్ల పదవీకా లం జనవరి 31తో ముగుస్తున్న నేపథ్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని బీఎల్ఎన్ గార్డెన్స్‌లో జగిత్యాల నియోజకవర్గ సర్పంచులు, ఉప సర్పంచ్‌లను ఎమ్మెల్యే దంపతులు సంజ య్ కుమార్, రాధిక, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ సత్కరించారు.
అనంతర వారితో కలిసి సహపంక్తి భోజనాలు చేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కేసీఆర్ నిరంతరం కృషి చేశారన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయ స్థాయిలో జిల్లానురెండో స్థానంలో నిలుపడంలో సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజా ప్రతినిధుల పాత్ర చాలా గొప్పదని ప్రశంసిం చారు. సర్పంచులు పదవీకాలం పూర్తయినా ప్రజా జీవితంలో సేవ చేస్తూ ఆదర్శంగా ఉం డాలని ఆకాంక్షించారు.
అనంతరం ఎమ్మెల్యే దంపతులను సర్పంచులు, ఉప సర్పంచులు సన్మానించారు. కార్యక్రమంలో అన్ని మండలాల సర్పంచుల ఫోరం అధ్యక్షులు చెరుకు జాన్, గోడిసెల గంగాధర్, గుర్రాల రాజేందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, అనుపురము శ్రీనివాస్, ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వెంకటేశ్ గౌడ్, మహేశ్, మండల పార్టీ అధ్యక్షులు బాల ముకుందం, జిల్లా ఆర్టీఏ మెంబర్ సుధాకర్ రావు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

