ఇల్లంతకుంట, అక్టోబర్, 21 : కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్తున్న మోసపూర్తి హామీలను నమ్మొద్దని, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ సూచించారు. శనివారం సాయంత్రం మండలంలోని రేపాకలో ఎమ్మెల్యే ఆశీర్వాద సభకు రాగా గ్రామస్తులు మంగళ హారతులు, బతుకమ్మలు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. విజయం తథ్యమని తిలకం దిద్ది భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేకనే కాంగ్రెస్ నాయకులు అబద్దపు పథకాలను ప్రచారం చేస్తూ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మొదటి నుంచి కాంగ్రెస్ మోసాలతో కూడుకున్న పార్టీ అని, అభివృద్ధి అంటేనే బీఆర్ఎస్ అని ప్రజలకు నిరంతరం అండగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, కాంగ్రెస్కు వేస్తే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వృద్ధు లు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు అండగా ఉందన్నారు. రైతులకు రైతు బీమా, పెట్టుబడి సాయం, రుణ మాఫీ వంటి పతకాలతో అండగా ఉన్నది బీఆర్ఎస్ అని చెప్పారు. మూడోసారి అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని 90లక్షల మందికి కుటుంబానికి రూ.5లక్షల బీమా, సౌభాగ్య లక్ష్మి పథం ద్వారా నిరుపేద మహిళలకు నెలకు రూ.3వేలు ఫించన్, రూ.400కే గ్యాస్ సిలిండర్, అగ్రవర్ణాల పేదల కోసం నియోజకవర్గానికి ఒక రెషిడెన్సియల్ పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు.
అనంతరం కాం గ్రెస్, బీజేపి పార్టీల నుంచి 100 మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్యే కండు వా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఏఎంసీ చైర్మన్ మామిడి సంజీవ్, సెస్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుధగోని శ్రీనాథ్ గౌడ్, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పల్లె నర్సింహా రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు రోండ్ల తిరుపతి రెడ్డి, అన్నాడి అనంత రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎండ్ర చందన్, సర్పంచ్ రోండ్ల లక్ష్మి, ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య, నాయకులు సంతోష్ రెడి, నీలం అంజయ్య, శ్రీనివాస్, రాగటి రమేశ్, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.