ఇల్లంతకుంట, డిసెంబర్ 20: కాంగ్రెస్ ప్ర భుత్వానికి దమ్ముంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఫార్ములా ఈ-కార్ రేసుపై చర్చ పెట్టాల ని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టో అమలు చేసే పరిస్థితి లేక.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె సిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ప్రజాపాలన అంటే ప్ర శ్నించేవారిపై కేసులు పెట్టడమేనా అని మండిపడ్డారు. ఇల్లంతకుంటలో శుక్రవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రా ష్ట్రంలో పెట్టుబడులను ఆకర్శించడానికి ఫార్ములా ఈ-కార్ రేసును ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందని తెలిపారు. అయితే మాజీ మంత్రి కేటీఆర్ నిధులు దుర్వినియోగం చేశారని రేవంత్‌రెడ్డి సర్కారు ఆరోపణలు చే యడం సిగ్గుచేటన్నారు. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ సర్కారుపై ప్రజలు తిరగబడే పరిస్థితి నెలకొందన్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సెస్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రోండ్ల తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లె నర్సింహారె డ్డి, నాయకులు కేతిరెడ్డి వెంకట్‌రెడ్డి, వడియా ల సత్యనారాయణరెడ్డి, భాస్కర్, సలీం, ర ఘు, రాజారాం, రాములు, అంజయ్య, భూ మయ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు.