Appointed | ముత్తారం, జనవరి 9 : సమాచార హక్కు చైతన్య సమితి జిల్లా కన్వీనర్ గా ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన డాక్టర్ జావిద్ పాషా ను నియమించినట్లు వ్యవస్థాప అధ్యక్షుడు సాదుల పూర్ణచందర్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన వ్యవస్థాపక అధ్యక్షుడికి జావిద్ భాషా ఈ సందర్భంగా కృతజ్ఞ తెలిపారు. ప్రజల మేలు కోసం నిరంతరం కృషి చేస్తూ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు.