కరీంనగర్, (నమస్తే తెలంగాణ) ఏప్రిల్ 14 : రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని ఊరూరా ఘనంగా జరుపుకొన్నారు. వేడుకల్లో అధికారులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొని అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బడుగుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ‘జై భీమ్.. జై అంబేద్కర్’ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
కోరుట్ల రూరల్: నమస్కరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల
గంగాధర: మధురానగర్‌లో చౌరస్తాలో నినదిస్తున్న మాజీ ఎమ్మెల్యే రవిశంకర్, నాయకులు
మంథని: నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్, ఇల్లంతకుంట: నినదిస్తున్న మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
జూలపల్లి : నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, రఘువీర్‌సింగ్
గోదావరిఖని: ఎన్టీపీసీలో అంబేద్కర్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే చందర్