Football competitions | ధర్మారం, జులై 8 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిలు ఆర్ అనూష, వీ వైష్ణవి రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల జూలై 5న గోదావరిఖని సింగరేణి స్టేడియం లో జిల్లా స్థాయి ఫుట్ బాల్ బాలికల విభాగం పోటీలలో వీరిద్దరూ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు సెలెక్ట్ అయ్యారు.
సదరు విద్యార్థినులు అనూష, వైష్ణవి ఈ నెల 9 నుండి 12 వరకు మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్ లో రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరఫున ఆడనున్నారు. ఎంపికైన ఈ విద్యార్థినులను మంగళవారం పాఠశాల ఆవరణలో హెడ్మాస్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు ఎన్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు అభినందించారు.