Dongathurthi | ధర్మారం, అక్టోబర్ 5 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటుచేయాలని దొంగతుర్తి మండల సాధన సమితి నాయకులు మూదాం శ్రావణ్, గొట్టే లింగయ్య అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీరాములుకు వారు మండల ఏర్పాటు గురించి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గత సంవత్సరం క్రితం దొంగతుర్తి మండల సాధన సమితి ఆధ్వర్యంలో అన్ని గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల సంపూర్ణ మద్దతు తెలిపినట్లు వారు వివరించారు. దొంగతుర్తి మండల కేంద్రంగా ఏర్పాటుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజల సంతకాల సేకరణ చేపట్టి ఇప్పటికే విజ్ఞప్తి చేశామని వారు పేర్కొన్నారు. ఈ క్రమంలో మండల ఏర్పాటుకు సహకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు అడిషనల్ కలెక్టర్ కు సమర్పించిన వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు.