Ramanjaneya Temple | వీణవంక, సెప్టెంబర్ 8: వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో నిర్మిస్తున్న రామాంజనేయ గుడి కి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. బండ విజయమ్మ-మల్లారెడ్డి దంపతులు రూ.46,116 విలువ గల శివలింగాన్ని వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అందజేశారు. కాగా మల్లారెడ్డిపల్లికి చెందిన రఘుపతిరెడ్డి-మానస, చంద్రారెడ్డి-అనూష దంపతులు రూ.50,116, సాయిపవన్ రెడ్డి, శ్యావ్య రూ.10,116లు, మందాటి మధూకర్ రెడ్డి-లావణ్య దంపతులు రూ.10,116 లు గుడి నిర్మాణానికి అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి మాట్లాడుతూ గుడి నిర్మాణానికి రూ.1.16 లక్షల విరాళం అందజేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.