KODIMYALA | కొడిమ్యాల, ఏప్రిల్ 02 : కొడిమ్యాల మండల కేంద్రంలో నిర్మాణం జరుగుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి మండల మండల కేంద్రానికి చెందినఏర్రోజు మణెమ్మ కుటుంబ సభ్యులు ఆలయానికి శాశ్వత చందా దారులుగా రూ.25 వేలు ఆలయ కమిటీ సభ్యులకు బుధవారం అందజేశారు. ఆలయానికి ధన రూపేనా సహకరించిన దాతలకు అర్చకులు నాగరాజు రమేష్ తీర్థ ప్రసాదాలు అందజేసి స్వామివారి మంగళ శాసనములతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.