Donating body | కోల్ సిటీ , మే 31: గోదావరిఖనికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు మంతెన రాజలింగయ్య, డిస్మిస్ కార్మికుడు నూకల గట్టయ్య తమ మరణానంతరం శరీరాలను రామగుండం మెడికల్ కళాశాలకు అప్పగిస్తామని ప్రకటించారు. ఈమేరకు స్థానిక గాంధీచౌక్ సమీపంలోని సీఐటీయూ కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఇరువురికి సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభినందన పత్రాలను సీఐటీయూ అధ్యక్షుడు ఆరెపల్లి రాజమౌళి చేతుల మీదుగా అందజేశారు.
వైద్య విద్యార్థుల పరిశోధన కోసం తమ దేహాలను దానం చేసేందుకు ముందుకు రావడం స్ఫూర్తి దాయకమన్నారు. ప్రతి ఒక్కరూ మూఢ నమ్మకాలను వీడి మరణానంతరం నేత్ర, అవయవ, శరీర దానం చేయాలని కోరారు. వీరిని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి, మెండ శ్రీనివాస్ లు అభినందించారు. కార్యక్రమంలో సదాశయ జాతీయ కార్యదర్శి లింగమూర్తి, ప్రచార కార్యదర్శి వాసు, మగువ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షురాలు శశికళతోపాటు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.