peddapally | పెద్దపల్లి, ఏప్రిల్3: దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని అదనపు కలెక్టర్ దాసరి వేణు అన్నారు. కలెక్టరేట్లో దొడ్డి కొమురయ్య 98వ జయంతి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.
దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మహనీయులను ఒక కులానికో, ఒక వర్గానికో పరిమితం చేయకుండా ఆయన ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి రంగారెడ్డి, డీఏవో దోమ ఆదిరెడ్డి, ఆర్టీవో పీ రంగారావుతో పాటు పలువురు జిల్లా అధికారులు, కలెక్టరెట్ సిబ్బంది, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.