Doddi Komaraiah | పెద్దపల్లి టౌన్ జులై 4 : నిజాం పాలనలో భూస్వాములు పెత్తందారులు జాగీరుదారులు తెలంగాణలో సాగించిన వెట్టి చాకిరి నిర్బంధపు శ్రమకు వ్యతిరేకంగా దొడ్డి కొమురయ్య పోరాటం చేసి ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రవెల్లి ముత్యంరావు అన్నారు. తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా సీపీఎం కార్యాలయంలో కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
సందర్భంగా ముత్యంరావు మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధించాలని ఏకైక నినాదంతో దొడ్డి కొమురయ్య పేద ప్రజల కోసం పోరాడాడని కొనియాడారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కొమురయ్యను పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేసి తెలంగాణలోనే మొదటి ఎన్కౌంటర్ చేయబడిన కొమురయ్య ఆశయ సాధనకు నేటి యువత పోరాటాల వైపు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు సిపెల్లి రవీందర్, కల్లేపల్లి అశోక్, శ్రీనివాస్ రెడ్డి, నవీన్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.