కోరుట్ల, జూలై 26: ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న బీడీ కార్మికుల పిల్లలు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరుట్ల బీఎండబ్ల్యూఎఫ్ డిస్పెన్సరీ వైద్యుడు శ్రీకాంత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025- 26 విద్యా సంవత్సరానికి ప్రోత్సాహక స్కాలర్‌షిప్‌ల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 1 నుంచి 10 తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆగస్టు 31 లోగా, ఇంటర్ నుంచి డిగ్రీ, ప్రొఫెషనల్స్ కోర్సులు చదివే విద్యార్థులకు అక్టోబర్ 31 వరకు గడువు ఉన్నట్లు పేర్కొన్నారు.
దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థి పాస్ మార్క్ మెమో, బ్యాంకు పాస్ బుక్, అధార్‌కార్డు, అదాయ, కుల ధ్రువీకరణ పత్రం, కార్మికురాలి బీడీ కంపెనీ, గుర్తింపు కార్డు, ఆపాయింట్మెంట్ లెటర్ ఉండాలని సూచించారు. ఆన్లైన్లో నేషనల్ స్కాలర్‌షిఫ్ పోర్టల్ www.scholorships. gov.in ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. సందేహాల నివృత్తి కోసం హెల్ప్‌లైన్ నంబర్ 0120 – 6619540లో లేదా వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, కేంద్రీయ సదన్, సుల్తాన్‌బజార్, హైదరాబాద్ 50001 లేదా ఫోన్ నంబర్ 040-29561297 నంబర్‌తో పాటు దగ్గరలో ఉన్న బీడీ కార్మికుల దవాఖాన మెడికల్ ఆఫీసర్‌ను సంప్రదించాలని తెలిపారు.