MLA Padi Kaushik Reddy | తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు.. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులకు సూచించారు. హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో గల మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు.
MLA Padi Kaushik Reddy | హుజురాబాద్, ఏప్రిల్ 20 : తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులకు సూచించారు. హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో గల మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పంటకు సరైన ధర లభించేలా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను సూచించారు.
ముఖ్యంగా తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకూడదని, అనవసరంగా కోతలు విధించకుండా న్యాయంగా కొనుగోళ్లు జరపాలని పేర్కొన్నారు. రైతులు మార్కెట్ యార్డ్‌కు తీసుకువచ్చిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని, తూకం, హమాలీ, రవాణా, చెల్లింపుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరిగినా సహించబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

