Palakurthi | పాలకుర్తి : పాలకుర్తి మండలం పుట్నూర్ సమీపంలో ఉన్న కేజీబీవీ పాఠశాలను అనుకుని వ్యవసాయ భూముల్లో రైస్ మిల్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వకూడదని ఆ గ్రామ మాజీ సర్పంచ్ రావుల శారద కోరారు. ఈ మేరకు ఆమె గ్రామపంచాయతీ కార్యదర్శికి సోమవారం ఫిర్యాదు చేశారు. పాఠశాల సమీపంలో రైస్ మిల్లులు ఏర్పాటు చేస్తే విద్యార్థినులు దుమ్ము, దూళీతో పాటు మిల్లులో స్థానికేతరులు పనిచేసేవారు ఉంటారని ఇబ్బందులు తలెత్తుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రైస్ మిల్లు నుండి వచ్చే విషవాయువులు అలాగే దుమ్ము ధూళితో, కేజీబీవీ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు అస్వస్థతకు గురి అవుతారని, కావున విద్యార్థినుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎలాంటి రైస్ మిల్లులకు అనుమతి ఇవ్వద్దంటూ గ్రామ కార్యదర్శిని కలిసి విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గొల్లపల్లి విష్ణు గౌడ్, నారా సత్తయ్య పటేల్, వైద్య నరేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.