మతతత్వ పార్టీలను నమ్మొద్దు
మతతత్వ పార్టీలను నమ్మొద్దని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ సూచించారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమాన్ని ఓర్వలేక, వారు చేసింది చెప్పలేక కుల, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. శుక్రవారం రాయికల్ మండల కో ఆప్షన్ సభ్యుడు ముఖీద్ ఆధ్వర్యంలో అల్లీపూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు ఎర్రవేని ఆశాలు
- అభివృద్ధిని ఓర్వలేక చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నరు
- ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల, సెప్టెంబర్ 9: మతతత్వ పార్టీలను నమ్మొద్దని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ సూచించారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమాన్ని ఓర్వలేక, వారు చేసింది చెప్పలేక కుల, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. శుక్రవారం రాయికల్ మండల కో ఆప్షన్ సభ్యుడు ముఖీద్ ఆధ్వర్యంలో అల్లీపూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు ఎర్రవేని ఆశాలు, అనుచరులు 30 మందికి పైగా బీజేపీ, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్యే సంజయ్ గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కంటే తెలంగాణలో ఎక్కువగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పా రు.
స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు 12 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు, 1.50లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిందని, ఈ ఎనిమిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. యువకులను రెచ్చగొట్టడం మాని ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలని బీజేపీ నేతలకు సూచించారు. ఇక్కడ పార్టీ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, రాయికల్ పట్టణాధ్యక్షుడు ఇంతియా జ్, జిల్లా కౌన్సిలర్ల అధ్యక్షుడు ఫోరం పం బాల రామ్ కుమార్, కౌన్సిలర్ అల్లే గంగ సాగర్, నాయకులు ఎర్రవేని తిరుపతి, జాన గంగాధర్, వెంకటేశ్వర్ రావు, వినోద్ రావు, జహంగీర్, దాసరి ప్రవీణ్, ఉపాధ్యక్షుడు దుమాల రాజ్ కుమార్, కార్మిక వి భాగం నేత తొలిప్రేమ శ్రీనివాస్, యూత్ ప్రధాన కార్యదర్శి శరత్ రావు, యూత్ మండలాధ్యక్షుడు సురేందర్ రెడ్డి, సుంకె మహేశ్, ఎస్టీ విభాగం శ్రీరామ్ భిక్షపతి, ఢిల్లీ రామారావు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

