Peddapally | పెద్దపల్లి, జూలై31: వినికిడి లోపం గల పది మంది విద్యార్థులకు వినికిడి పరికరాలను డీఎంహెచ్వో డాక్టర్ అన్న ప్రసన్న కుమారి గురువారం అందజేశారు చేశారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో ఆరోగ్య శాఖ గుర్తించిన వినికిడి లోపం గల పది మంది విద్యార్థులను జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని అలీమ్ కో ట్రస్ట్ నందు వినికిడి పరీక్షలు నిర్వహించారు. కాగా లీమ్ కో ట్రస్ట్ వినికిడి పరికరాలను పంపగా పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు.
వైద్యులు సమయ పాలన పాటించాలి.. : డీఎంహెచ్వో అన్న ప్రసన్న కుమారి
వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని డీఎంహెచ్వో అన్న ప్రసన్న కుమారి అన్నారు. ఆర్బీఎస్కే వైద్యాధికారులు, సిబ్బందితో గురువారం డీఎంహెచ్వో చాంబర్లో సమావేశం నిర్వహించారు. వైద్యులు మీ టూర్ షెడ్యూల్డ్ ప్రకారం అంగన్ వాడీ, పాఠశాలలకు వెళ్లే తేదీలను నెల రోజుల ముందు వారికి తేలియచేయాలని సూచించారు. పాఠశాల సందర్శనంలో భాగంగా ఉదయం సీజనల్లో వచ్చే వ్యాధులు, నివారణ, జాగ్రత్తలు అవగాహన కల్పించి, సాయంత్రం వరకు ఉండి హాజరును నమోదు చేయాలన్నారు..
పాఠశాలలోని వంటగదిని పరీశిలించి, వంటగదిలో పనిచేసే సిబ్బంది పరిశుభ్రత పాటించే విధంగా సూచనలు ఇవ్వాలన్నారు. వంటగది సమీపంలో మునగ చెట్టు, కరివేపాకు చెట్టును పెంచి వాటి ఆకులను వండే కూరలలో వేయాలని, దాని వల్ల పిల్లలలో విటమిన్-ఏ అందుతుందని వంట వండే వారికి తేలియచేయాలన్నారు. ఆర్బీఎస్కే ప్రోగ్రాం అధికారి డా. బీ కిరణ్ కుమార్, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.