Dasari Yuva Pratibha Award | సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన మాసం సతీష్ రెడ్డి అరుదైన పురస్కారానికి ఎంపికయ్యారు. సినిమా రంగంలో ఆయా విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రతి ఏటా దాసరి ఫిల్మ్ అవార్డ్స్ అందిస్తుంటారు.
ఇటీవల విడుదలై విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రానికి సతీష్ రెడ్డి డైరెక్టర్అఫ్ ఫోటోగ్రఫీ చేశారు. సమ్మతమే, K.రాంప్ చిత్రాలకు డీఓపిగా పని చేసినoదుకు గాను దాసరి యువ ప్రతిభ అవార్డు-2025కు ఎంపిక చేసినట్లు అవార్డ్స్ కమిటీ ఫౌండర్ చైర్మన్ తుమ్మలపల్లి రామాసత్యనారాయణ, అవార్డు కమిటీ సభ్యులు తమ్మారెడ్డి భరద్వాజ, సి కళ్యాణ్, వేలంగి నరసింహారావు, జర్నలిస్టు ప్రభు తెలిపారు.
మే 1న హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగే అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో సతీష్ రెడ్డి దాసరి యువ ప్రతిభ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.