District level karate team | కోల్ సిటీ, సెప్టెంబర్ 7: గోదావరిఖని ఆర్సీవోఏ క్లబ్ లో ఆదివారం పెద్దపల్లి జిల్లా స్థాయి కరాటే అండర్- 14, 17 బాలురు, బాలికల విభాగంలో ఎంపిక పోటీలు జరిగాయి. ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్ ముఖ్యతిథిగా హాజరై ఈ ఎంపిక పోటీలను ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 200 మంది కరాటే క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. ప్రతిభ ఆధారంగా జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా కమిటీ అసోసియేషన్ సభ్యులు తగరం శంకర్, రమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు కొమరోజు శ్రీనివాస్, విజయ్ కుమార్, శోభారాణి, జావీద్, రేణుక, దుర్గా ప్రసాద్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.