Collector Koya sriharsha | పెద్దపల్లి రూరల్ జూన్ 27 : విద్యాశాఖలో పనిచేస్తున్న వారంతా సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారా..? పెద్దపల్లి మండలంలో సీఆర్ పీలు ఎందరు ఉన్నారు..? అంటూ జిల్లా కలెక్టర్ కోయశ్రీహర్ష ఎంఈవో కార్యాలయ సిబ్బందిని అడిగి తెలుసుకుంటూ ఆరా తీశారు. జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణంలో కమాన్ ఏరియా సుబాష్ విగ్రహం వద్ద గల ప్రభుత్వ పాఠశాలలో ఉన్న మండల విధ్యాధికారి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ శుక్రవారం అకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు, సిబ్బంది పనితీరుపై సీఆర్పిల విధులు, వారు నిర్వహిస్తున్న పనులను అడిగి తెలుసుకున్నారు. విధుల పట్ల ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని బాద్యతాయుతంగా మెదలు కోవాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారుంటే పని తీరు మెరుగు పర్చుకోవాలన్నారు. ఇక్కడ మండల విద్యాధికారి కార్యాలయసిబ్బంది ఉన్నారు.