Haripuram | ఓదెల, సెప్టెంబర్ 11: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం హరిపురం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం షూల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గ్యారవేని విజయ-నాగరాజు యాదవ్ చేతుల మీదుగా విద్యార్థులకు షూలను పంపిణీ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో, శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన సహాయ, సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన ప్రధానోపాధ్యాయులు మహేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజు, పావని, హేమలత, ఉపసర్పంచ్ మాటూరి మహేందర్, ముప్పు రాకేష్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.