Distribution | జగిత్యాల ఆగస్టు 20 : రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పబోతోంది. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబందించిన
మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేశారు. దీంతో ఆగస్టు వరకు రాష్ట్రంలో రేషన్ పంపిణీ ఆగిపోయింది. వచ్చె నెల సెప్టెంబర్ నుండి రేషన్ బియ్యం తిరిగి పంపిణీ చేయనున్నారు. ఈ క్రమంలో రేషన్ తీసుకునే వారికి ఉచితంగా రేషన్ సంచులను ప్రభుత్వమే ఇవ్వనుంది. ఈ సంచుల్లో సన్న బియ్యంతో పాటు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ముద్రించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బ్యాగులు రాష్ట్రంలోని అన్ని రేషన్ షాప్ డీలర్లకు అందించినట్లు అధికారుల ద్వారా తెలిసింది.
సెప్టెంబర్ నెల నుంచి రాష్ట్రంలోరేషన్ తీసుకునే వారికి సన్న బియ్యంతో పాటు ఈ ప్రత్యేకమైన సంచులను కార్డు దారులకు ఉచితంగా ఇవ్వనున్నారు. ఈ సంచులను బయట కొనాలంటే రూ.50 వరకుధర ఉంటుందని వ్యాపారులు చెబుతుండగా ప్రభుత్వం రాష్ట్రంలోని రేషన్ కార్డు హోల్డ్ర్లందరికి ఉచింతంగా ఇవ్వనున్నారు. ఈ సంచులపై సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫొటోలతో పాటుగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటో కూడా ఉండేలా ముద్రించారు. ఈ సంచి మీద ఇందిరమ్మ అభయ హస్తం పేరుతో ఆరు గ్యారంటీలకు సంబంధించిన వివరాలను కూడా ముద్రించిన బ్యాగులతోనే సెప్టెంబర్ నెల రేషన్ ఇవ్వనున్నారు. దీంతో రేషన్ కార్డు దారులకు ఇంటినుండి స్వంత బ్యాగులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందించే బ్యాగులతోనే బియ్యం తీసుకురావడం సులభతరం అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజా ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యం : చింతల నిర్మలా రెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చింతల నిర్మలా రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం అందిస్తుందని చెప్పారు. అలాగే సెప్టెంబర్ నెల నుండి లబ్ధిదారులు రేషన్ బియ్యం తీసుకుపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే బ్యాగులు అందిస్తుందని నిర్మలా రెడ్డి చెబుతూ పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
సన్నబియ్యాన్ని సంబరంగా తింటున్నారు.
వేముల సుభాష్ : బుగ్గారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సన్న బియ్యాన్ని అందరూ సంబరంగా తింటున్నారని జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల శుభాష్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిత్యం అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని చెప్పారు. సన్న బియ్యంతో పేద ప్రజలు సంతోషంగా ఉన్నారని, దాంతో పాటు సెప్టెంబర్ నుండి రేషన్ తీసుకుపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే బ్యాగులు అందిస్తుందని, రేషన్ కార్డు దారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.