Distribution of plates | చిగురుమామిడి, అక్టోబర్ 25 : చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు గంగిశెట్టి మధుర మ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం 62 మంది విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ చేశారు. ట్రస్టు నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్, ప్రధానోపాధ్యాయులు పీ లక్ష్మణరావు చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు.
విద్యార్థులకు మధ్యాహ్న భోజనాలకు ప్లేట్లు ఉపయోగపడతాయని, అలాగే పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందజేశారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు టాలెంట్ టెస్ట్ ఏర్పాటు చేసి వారికి ప్రోత్సాహంగా బహుమతి అందజేస్తామని ట్రస్టు నిర్వాహకులు తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ జ్యోతి, ఉపాధ్యాయులు శంకర్, చంద్రశేఖర్, శ్రీనివాస్, కవిత, షర్మిల, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.