కలెక్టరేట్, ఆగస్టు 26: దివ్యాంగుల కండ్లల్లో కనిపించే సంతోషమే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దీవెనలని, వారి ఆనందాన్ని ఎల్లవేళలా కొనసాగించేందుకు తపిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. నాడు సీమాంధ్ర పాలకులు దివ్యాంగులను చిన్నచూపు చూశారని, కానీ, సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ ఫలాలు అందిస్తూ సముచిత గౌరవం ఇస్తున్నారని ప్రశంసించారు. నేడు దేశంలోనే అత్యధిక పింఛన్ ఇస్తూ అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రిని దీవించాలని విజ్ఞప్తిచేశారు. శనివారం కరీంనగర్ కలెక్టరేట్లో దివ్యాంగులు, బీడీ టేకేదార్లకు ప్రభు త్వం పెన్షన్ ప్రొసీడింగ్స్‌ను పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ దివ్యాంగులను దైవ సమానులుగా భావించి అనేక సదుపాయాలు కల్పిస్తున్నారని చెప్పారు. ఉమ్మడి పాలనలో కేవలం 200 మాత్రమే పింఛన్ ఇస్తే, స్వరాష్ట్రంలో 4వేలు అందించడమే అందుకు నిదర్శనమన్నారు. నాడు ఒకరు మరణిస్తేనే మరొకరికి పిం ఛన్ ఇచ్చే పరిస్థితి ఉండేదన్నారు. కానీ, నేడు అర్హులందరికీ అందిస్తున్నామని చెప్పారు. బీడీ కార్మికులతోపాటు టేకేదార్లకు కూడా పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చే పింఛన్లను నేడు ఒక్క కరీంనగర్‌లోనే ఇస్తున్నామని గుర్తుచేశారు.
కరీంనగర్ జిల్లాలో ప్రతినెలా 23,641 మంది దివ్యాంగులకు 11. 85 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం లో సంపద పెంచి కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా రూపంలో పేదలకు పంచుతున్నామని చెప్పా రు. నాడు గుక్కెడు నీటి కోసం తండ్లాడిన తెలంగాణను నేడు కాళేశ్వరం జలాలు ముద్దాడుతున్నాయ ని పేర్కొన్నారు. మండుటెండల్లో సైతం మత్తళ్లు దూకుతున్న చెరువులు, కుంటలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీల దుష్ట పాలనతో అరిగోసపడ్డ తెలంగాణ ప్రజలు ఇప్పుడు సుఖ సం తోషాలతో జీవిస్తున్నారన్నారు. ఇప్పుడు ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో మళ్లీ కాంగ్రెస్, బీజేపీ నేతలు గ్రామాలకు వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక్కడి వనరులను దోచుకునేందుకు బయల్దేరుతున్నారని, ప్రజలు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
మనసున్న మారాజు సీఎం కేసీఆర్‌ను కాపాడుకుంటే, తెలంగాణ రాష్ట్రం పది కాలాలపాటు దేదీప్యమానమవుతుందన్నారు. మనకోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం సీఎం కేసీఆర్‌ను మరోసారి దీవించాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ డాక్టర్ బీ గోపి మాట్లాడుతూ, పెరిగిన పెన్షన్ డబ్బులు కూడా ఈనెల నుం చి వారి ఖాతాల్లో జమచేస్తున్నట్లు తెలిపారు. మిగతావారికి కూడా త్వరలోనే పింఛన్ ప్రొసీడింగ్ పత్రా లు అందజేయనున్నట్లు ప్రకటించారు. జడ్పీ చైర్ పర్సన్ కనమల్ల విజయ మాట్లాడుతూ, నాడు పెన్షన్ కోసం పైరవీలు చేయాల్సిన దుస్థితి ఉండేదని, నేడు అధికారులే ఇంటికొచ్చి పింఛన్ అందిస్తుండడం సీఎం కేసీఆర్ పారదర్శక పాలనకు నిదర్శనమన్నారు. మాయమాటలు చెప్పేటోళ్లను న మ్మొద్దని, అన్నం పెట్టిన వారిని మరవొద్దని కోరా రు.
మేయర్ సునీల్‌రావు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ దివ్యాంగులకు పింఛన్ పెంచి వారి పాలిట దే వుడిగా మారాడన్నారు. ఉద్యమకారుడిగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్‌ను మరోసారి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత మాట్లాడుతూ, రా ష్ట్రంలో మానవీయ కోణంలో పరిపాలన సాగుతుందన్నారు. కార్పొరేటర్ గందె మాధవి మాట్లాడు తూ, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఓట్ల కోసం కొత్త వేషాలతో వస్తున్నారని, వారిని తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అదనపు కలెక్టర్ ప్రపుల్ దే శాయ్, డీఆర్డీవో ఎల్ శ్రీలత, మార్కెట్ కమిటీ చైర్మ న్ రెడ్డవేని మధు, కరీంనగర్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, ముగ్దుంపూర్ సర్పంచ్ జక్కం నర్సయ్య పాల్గొన్నారు.