రామడుగు, ఫిబ్రవరి 20 : నియోజకవర్గ ప్రజల బాధలను పంచుకునేందుకే పొద్దుపొడుపు యాత్రతో ఇంటింటికీ వస్తున్నట్టు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండలం గుండి, షానగర్ గ్రామాల్లో సోమవారం నాలుగు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ, షానగర్‌లో 50 లక్షల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు. గుండిలో లబ్ధ్దిదారుల ఇండ్లకు వెళ్లి ఆడబిడ్డకు అన్నలా చీరతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించిన రూ. లక్షా నూటపదహార్ల మూడు చెక్కులను అందించారు. అనంతరం షానగర్‌లో ఒక కల్యాణలక్ష్మి చెక్కును అందించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, రామగుండం సింగిల్ విండో చైర్మన్ వీర్ల వేంకటేశ్వరరావుతో కలిసి రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ కార్యాలయ నూతన భవనం, రూ.30 లక్షలతో ఈజీఎస్ సీసీరోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గానికి చెందిన స్థానికుడిగా తనను ఆదరించి, ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించుకొని తమ బిడ్డగా అసెంబ్లీకి పంపించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.
రుణ తీర్చుకునేందుకే గడపగడపకూ వస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కలిగేటి కవితాలక్ష్మణ్, సర్పంచులు గుండి మానస-ప్రవీణ్, సైండ్ల కవితా కరుణాకర్, కొక్కెరకుంట విండో చైర్మన్ వొంటెల మురళీకృష్ణారెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు శుక్రొద్దీన్, ఏఎంసీ చైర్మన్ మామిడి తిరుపతి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు కొడిమ్యాల రాజేశం, బత్తిని తిరుపతిగౌడ్, గడ్డం మోహన్‌రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్‌రెడ్డి, నాయకులు చిరుత అంజయ్య, గునుకొండ అశోక్‌కుమార్, చిరుత రాంచంద్రం, పెంటి శంకర్, మినుకుల తిరుపతి, జంగిలి రాజమౌళి, పైండ్ల శ్రీనివాస్, మాదం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.