college students | చిగురుమామిడి, ఆగస్టు 14 : చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు జిల్లా ఇంటర్ విద్యాధికారి గంగాధర్ గుర్తింపు కార్డులను గురువారం పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చదువుతోపాటు క్రమశిక్షణ, సభ్యత సంస్కారం అలవర్చుకోవాలని విద్యార్థులు సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లాలోని ముందు వరుసలో ఉండేటట్లు పట్టుదలతో లక్ష్యం చేరుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శశిధర్ శర్మ, అధ్యాపకులు సంపత్ కుమార్, రవికుమార్, కృష్ణమోహన్, అనిత, మమత, కవిత, లైబ్రేరియన్ చంద్రశేఖర్, జూనియర్ అసిస్టెంట్ వలి పాషా విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు సొంత ఖర్చుతో గుర్తింపు కార్డులను అందజేసిన ప్రిన్సిపాల్ ను అందుకు సహకరించిన అధ్యాపకుడు మహేందర్ ను జిల్లా ఇంటర్ విద్యాధికారి గంగాధర్ అభినందించారు.