Exam pads Distribution | చిగురుమామిడి, నవంబర్ 22: చిగురుమామిడి మండలంలోని తొమ్మిది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో పదో తరగతి చదువుతున్న 263 మంది విద్యార్థులకు హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లు నిర్వాహకుడు గంగిశెట్టి జగదీశ్వర్ పంపిణీ శనివారం పంపిణీ చేశారు.
మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రతీ ఏటా పేద విద్యార్థులకు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. 2011 నుండి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 10వేల మంది విద్యార్థులకు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు జగదీశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత భాషబత్తిని ఓదెలు కుమార్, అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.