చొప్పదండి, నవంబర్ 23: పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలానికి చెందిన 10 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 5,41,500 ఆర్థిక సాయం మంజూరైంది. కాగా, గంగాధర మండలం బూరుగుపల్లిలోని నివాసంలో బుధవారం ఆయన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో నిరుపేదలు దవాఖానలో వైద్యం చేసుకుంటే ఖర్చులపాలై తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజారోగ్యమే ధ్యేయంగా దవాఖానలో చికిత్స పొందిన వారు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆర్థిక సాయం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ గన్ను శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు మాచర్ల వినయ్‌కుమార్, చీకట్ల రాజశేఖర్, వెంకటేశ్, కుమార్, స్వామి, మామిడి రాజేశం, తిరుపతి, రాజయ్య పాల్గొన్నారు.