Distribution benches | సుల్తానాబాద్ రూరల్, ఆగస్టు 4 : పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని బొంతకుంటపల్లి ప్రాథమిక పాఠశాలకు సోమవారం దాస్ సేవా సమితి ఆధ్వర్యంలో డిల్లీ పబ్లిక్ స్కూల్స్ సీఈవో మల్క యశస్వి సహకారంతో రూ.లక్ష విలువ గల 20 డబుల్ డెస్క్ బెంచెస్ వితరణ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గర్రెపల్లి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు కవిత హాజరయ్యారు.
ఈ సందర్భంగా సేవా సమితి ప్రతినిధి రవి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను పంపించాలని, విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. ప్రవేట్ పాఠశాల కంటే మెరుగైన వసతులు కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలకు ప్రహరీ నిర్మాణం కూడా చేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొంతకుంటపల్లి మాజీ సర్పంచ్ ఆసరి రాజయ్య, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తుల సుధాకర్ రావు, ఉపాధ్యాయులు సాంబయ్య, సత్తయ్య, చంద్రమౌళి, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.