Peddapally | పెద్దపల్లి రూరల్, ఫిబ్రవరి 20 : దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని పెద్దపల్లి ఎంఈవో సురేందర్‌కుమార్ సూచించారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొని ప్రతిభ చాటిన దివ్యాంగ విద్యార్థులను ఆయన మండల కేంద్రంలోని మండల విద్యావనరుల కేంద్రంలో సంబంధిత దివ్యాంగులైన క్రీడాకారులను శుక్రవారం అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17న హైదరాబాద్ లో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి దివ్యాంగుల క్రీడల పోటీలు జరిగాయని, క్రీడల్లో పెద్దపల్లి మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన దివ్యాంగ విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరచి బహుమతులు, ప్రశాంసా పత్రాలు అందుకున్నారని అన్నారు.
పెద్దపల్లి మండల ప్రతిష్టను పెంచినందుకు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు, దన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దబొంకూరు హైస్కూల్ హెచ్ఎం రామగిరి సుదర్శన్, పెద్దపల్లి క్లస్టర్ సీఆర్పీ బాలసాని వెంకటేశం గౌడ్, ఐఈఆర్పీలు డీ సంధ్యారాణి, ఎన్.రజిని తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.