 
                                                            Lions Club | ధర్మారం,అక్టోబర్ 31: జాతీయ ఐక్యతా దినోత్సవం (సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి)ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో శుక్రవారం షుగర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 60 మంది రక్తం సేకరించి షుగర్ పరీక్షలు చేశారు.
10 మందికి షుగర్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించి వారికి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఇప్ప మల్లేష్, రీజియన్ సెక్రెటరీ తలమక్కి రవీందర్ శెట్టి, వైస్ ప్రెసిడెంట్- 1 నాడెం శ్రీనివాస్, కడారి కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
 
                            