జగిత్యాల రూరల్, జూన్ 28: అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఫెయిల్ అయిందని, సంక్షేమాన్ని మరిచి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నదని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సుల్లో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులపై పగబట్టిందని, బస్ పాస్ చార్జీలు పెంచి పైశాచిక ఆనందం పొందుతున్నదని మండిపడ్డారు.
ఈ మేరకు శనివారం జగిత్యాల ఆర్టీసీ డిపో ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ధర్నా చేశారు. ఇప్పటి వరకు సాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, బెస్ట్ అవైలబుల్ సూళ్లకు నిధులు ఇవ్వకపోవడంతో పేద పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని, ఇది చాలదన్నట్టు మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా బస్ పాస్ చార్జీల పేరుతో మరింత భారం మోపడం సరికాదన్నారు. పెంచిన బస్ పాస్ చార్జీలు వెంటనే తగ్గించకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
రాయికల్ పట్టణ శివారులోని ఇటిక్యాల సమీపంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లేందుకు ప్రయాణ సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, కాలేజీ వేళల్లో బస్సు నడిపించాలని ఆర్టీసీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఇక్కడ ప్యాక్స్ చైర్మన్లు మహిపాల్ రెడ్డి, సందీప్ రావు, బీఆర్ఎస్ ్టమండల పట్టణాధ్యక్షులు తుమ్మ గంగాధర్, బరం మల్లేష్, అనిల్, తేలు రాజు, మాజీ జడ్పీటీసీ మహేశ్, మాజీ ప్రజా ప్రతినిధులు దేవేందర్ నాయక్, తురగ శ్రీధర్ రెడ్డి, బుర్ర ప్రవీణ్ గౌడ్, జకుల తిరుపతి, సాయి కుమార్, మహేందర్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.