Munnur Kapu Sangam | ధర్మారం,ఆగస్టు10: ధర్మారం మండల కేంద్రం హనుమాన్ మున్నూరు కాపు సంఘం నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా గాండ్ల స్వామి, నార ప్రభాకర్, అధ్యక్షుడిగా నార చంద్రయ్య, ఉపాధ్యక్షులుగా సాన జయూకర్, బండారి స్వామి, ప్రధాన కార్యదర్శిగా కడారి కుమార్, కోశాధికారిగా నార సురేందర్, సహాయ కార్యదర్శులుగా నార ప్రేమ్ సాగర్, తోట శ్రీకాంత్, ప్రచార కార్యదర్శిగా నార సంజీవ్, కార్యవర్గ సభ్యులుగా బొలిశెట్టి లక్ష్మయ్య, బండారి సాహిత్య, పుప్పాల అనుక్, బండారి మనోజ్, ఆకుల శంకరయ్య, మదాసు శంకరయ్య ఎన్నికయ్యారు.