Dharmaram | ధర్మారం, జూలై 17 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఏ హర్షిణి, పదో తరగతి విద్యార్థులు ఎన్ సంధ్య, ఎస్ రితిక, రాష్ట్రస్థాయి మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ పరుగు పందెం పోటీలకు ఎంపికయ్యారు.
వీరు జిల్లాస్థాయిలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో మంచి ప్రతిభను కనభరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కాగా వీరు ఈనెల 18న మెదక్ జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటారు. సదరు విద్యార్థుల ఎంపిక పట్ల ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం పాఠశాలలో వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు బైకని కొమురయ్య, మేకల సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.