KTR | ధర్మపురి, సెప్టెంబర్ 26: వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రతిభావంతులైన వారికి జీ తెలుగు న్యూస్ ఆధ్వర్యంలో అచీవర్స్ అవార్డుల ప్రధానోత్సవం హైదరాబాద్ జలవిహార్ వేదికగా నిర్వహించారు. అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ధర్మపురికి చెందిన సంగనబట్ల నర్సయ్య అచీవర్స్ అవార్డును అందుకున్నారు.
తెలుగు సాహిత్యం, పురాణాలు మరియు తెలంగాణ, ఆంధ్ర చరిత్రలో సమాజానికి చేసిన విశేష కృషికి ని గుర్తించి జీతెలుగు న్యూస్ ఈ అవార్డుకు నర్సయ్యను ఎంపిక చేయగా.. శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా జీతెలుగు యాజామాన్యానికి అవార్డు గ్రహీత సర్సయ్య ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శకుడు హరీష్ శంకర్, నటుడు తనికెళ్ల భరణి, జీతెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ భరత్ పాల్గొన్నారు.