Raghuveer Singh | పెద్దపల్లి కమాన్, జనవరి 26: బీఆర్ఎస్ ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల ఇంచార్జ్ గా పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్ నియమితులయ్యారు. కాగా ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో రఘువీర్ సింగ్ ను సోమవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, పుట్ట మధు, రీజనల్ శిశు సంక్షేమ శాఖ మాజీ కార్పొరేషన్ చైర్మన్ మూల విజయ రెడ్డి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా రఘువీర్ సింగ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రఘువీర్‌సింగ్ మాట్లాడుతూ ధర్మపురి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురువేయడం లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ సమిష్టిగా పని చేయాలని సూచించారు.