Dharmanayak Thanda | సారంగాపూర్ : గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధర్మనాయక్ తండా గ్రామానికి నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.20లక్షలు మంజూరు చేసింది. దీంతో 2024 జనవరి 20న విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భవన నిర్మాణ పనులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పనులు ప్రారంభించారు.
గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు ఫిల్లర్ల వరకు చేపట్టిన పనులు నిధుల లేమితో మధ్యలోనే ఆగిపోయాయి. నూతన గిరిజన గ్రామం దర్మానాయక్ తండా గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించి పంచాయతీ భవనం పనులు పూర్తి చేసి వినియోగంలోకి వచ్చేలా సంభందిత శాఖ అధికారులు చొరవ తీసుకోవాలని తాజామాజీ సర్పంచ్ భూక్య సంతోష్ కుమార్ కోరుతున్నారు. గ్రామపంచాయతీ భవనం లేక అద్దె భవనంలో ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం, అధికారులు వెంటనే ఆగిపోయిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరారు.