Narayanapur | సుల్తానాబాద్ రూరల్, జనవరి 29 : సమ్మక్క సారమ్మ జాతరలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామంలోని సమ్మక్క సారమ్మ జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై మొక్కలు చెల్లించుకున్నారు. రెండో రోజు గురువారం జాతర కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో సమ్మక్కను డప్పు చప్పులతో అంగరంగ వైభవంగా పూజారులు తీసుకువచ్చారు.
సమ్మక్క గద్దెకు చేరుకోగా భక్తులు పెద్ద సంఖ్యల హాజరు కావడంతో జాతర ప్రాంగణం కిక్కిరిసిపోయింది. శివసతుల పూనకాలు, భక్తిశ్రద్ధలతో చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ చైర్మన్ తిరుపతిరావు, సర్పంచ్ గుడుగుల సతీష్ కుమార్, ఉపసర్పంచ్ రామారావు, కమిటీ సభ్యులు, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీవో దివ్య దర్శన్ రావు సందర్శించారు.