Dharmaram | ధర్మారం, జూన్14 : ధర్మారం, ఎండపల్లి మండలాల రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కమిటీ నూతన కార్యవర్గాన్ని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం ఎన్నుకున్నారు. ఈ మేరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారంతా ప్రత్యేక సమావేశం నిర్వహించి నూతన అసోసియేషన్ కమిటీని ఎన్నుకోవాలని నిర్ణయించారు. అసోసియేషన్ కమిటీ అధ్యక్షుడిగా దేవి జనార్ధన్, గౌరవ అధ్యక్షుడిగా మేడవేణి తిరుపతి, సలహాదారులుగా దేవి రాజ లింగయ్య ఎన్నికయ్యారు.
కమిటీ ఉపాధ్యక్షులుగా గాజుల లక్ష్మణ్, మిట్ట తిరుపతి, కేశవేణి కుమారస్వామి, గాజుల రాజు, బొంగాని సత్యనారాయణ, కొత్తపేట రాము,ప్రధాన కార్యదర్శిగా, బొమ్మగానీ సతీష్ కుమార్, కోశాధికారిగా బొమ్మవరం వేణుగోపాల్ రావు, సంయుక్త కార్యదర్శి మేడ వేణి వినోద్, అమరపల్లి నారాయణ, ప్రచార కార్యదర్శి లావుడియా తిరుపతి నాయక్, సందవేని మహేందర్, సభ్యులుగా రేగుల శ్రీనివాస్, రాజు నాయక్ భూక్య, నేరెళ్ల వెంకటేష్, ఇస్లావత్ కిషన్ నాయక్, గడ్డం రాజేశ్వర్ రెడ్డి, కంసాని ఎల్లయ్య, మేడవేణి శ్రీధర్, ఎనగంటి గంగయ్య, బత్తిని మల్లేశం తదితరులు ఎన్నికయ్యారు.