పెగడపల్లి: పెగడపల్లి మండలం మ్యాకవెంకయ్యపల్లిలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో రూ.1 కోటి అభివృద్ధి పనులు చేపట్టినట్లు బీఆర్ఎ ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మ్యాకవెంకయ్యపల్లిలో చీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన పార్టీ జండా ఆవిష్కరించి, సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, చిన్నదైన ఈ ఒక్క గ్రామంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం నూతన జీపీ భవనం, సీసీ రోడ్లు, స్మశానవాటిక నిర్మాణంతో పాటు, చెరువు మరమమత్తు, వంతెనల నిర్మాణం వంటి రూ.1కోటికి పైగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని మల్లారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉప్పుగండ్ల నరెందర్ రెడ్డి, ఇనుకొండ మోహన్ రెడ్డి, మాదారపు కరుణాకర్‌రావు, ఇనుగొండ్ల కరుణాకర్ రెడ్డి, మడిగెల తిరుపతి, పలుమారు విజయ్ యాదవ్, వెల్మ సత్యనారాయణరెడ్డి, సంధి చంద్రారెడ్డి తదితరులున్నారు.