Collector Koya Sri Harsha | పెద్దపల్లి, జూలై 7: జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో డీఎంఎప్టీ, టీజీఈడబ్ల్యూఐడీసీ నిధుల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులపై రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలెక్టర్ సోమవారం సమావేశమయ్యారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డీఎంఎఫ్టీ, ఇతర నిధుల నుంచి రోడ్లు భవనాలు శాఖ చేపట్టిన బ్రిడ్జి, రోడ్లు, ఆసుపత్రి, పాఠశాల భవనాలు, ఇతర అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, నిర్దిష్ట గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని సూచించారు. టీజీఈడబ్ల్యూఐడీసీ నిధుల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన 102 అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయలన్నారు. ఈ సమావేశంలో ఆర్అండ్బీ ఈఈ భావ్ సింగ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.