Teaching Skills | కాల్వ శ్రీరాంపూ ర్. మే 23. వృత్యంతర శిక్షణ ద్వారా బోధనా నైపుణ్యాల అభివృద్ధి జరుగుతుందని తహసీల్దార్ జగదీశ్వర్ రావు అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఉపాధ్యాయులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులకు పలు సూచనలు తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయులకు అన్ని సబ్జెక్టులలో శిక్షణతో పాటు డిజిటల్ బోధన పట్ల ప్రభుత్వం శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రభుత్వ పాఠశాల లు బలపడతాయని తెలిపారు.
అదేవిధంగా తను స్వయంగా రచించిన లిటిల్ బాలల కథలు పుస్తకాన్ని మండల విద్యాధికారి సిరిమల్ల మహేష్ కు అందజేశారు. కష్టమైన సైన్స్ పాఠాలను అందరికీ తెలిసేలా చక్కగా చిన్ని చిన్ని కథల్లో ప్రచురించిన లిటిల్స్ కథల పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉందని దానిని మరింత కొనసాగింపునకు ఉపాధ్యాయులు కృషి చేస్తారని విద్యాధికారి సిరిమల్లె మహేష్ పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఆర్పీలు స్వప్న, సంపత్, వేణు, కుమార్, భానుచందర్, దేవేందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.