సారంగాపూర్, నవంబర్ 13 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎంపీగా ఉన్నప్పుడే జగిత్యా ల జిల్లాగా ఏర్పడి, అభివృద్ధి సాధించిందని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ గుర్తు చేశారు. పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నప్పుడు ఆమె చేసిన కృషితో బీఆర్ఎస్ ప్రభు త్వం రోళ్లవాగు ఆధునీకరణకు శ్రీకారం చు ట్టిందని స్పష్టం చేశారు. మళ్లీ అభివృద్ధి కోసం జగిత్యాల ప్రాంతానికి కవిత రావాలని ప్రజ లు కోరుకుంటున్నారని చెప్పారు. బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్ట్‌ను బుధవా రం సాయంత్రం బీఆర్ఎస్ నాయకులు, స్థాని క రైతులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ ప్రాంత రైతులు బాధలు పడుతుండడం చూసి రోళ్లవాగును సందర్శించానని చెప్పారు.
ఉమ్మ డి సారంగాపూర్ మండలంలో సాగు, తాగునీటికి ఇబ్బందులు పడుతున్న రైతులకు రోళ్లవా గు ప్రాజెక్ట్‌తో కవిత వెన్నుదన్నుగా నిలిచారని చెప్పారు. తాను పదవిలో లేకున్నా కేసీఆర్‌తో మాట్లాడి ప్రాజెక్ట్‌ను ఆధునీకరించడానికి 135 కోట్లు మంజూరు చేయించారని తె లిపారు. 99శాతం పనులు కేసీఆర్ నాయకత్వం లో కవిత ఆధ్వర్యంలో పూర్తయ్యాయని గుర్తు చేశారు. కానీ, పదకొండు నెలల పాలనలో కనీ సం ఒక్క షటర్ కూడా బిగించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. షటర్లు లేక నీటి ప్రవాహం వస్తున్నదని, దీంతో పొలాలు తడిగా మారి హార్వెస్టర్లు రావడానికి ఇబ్బందిగా మారిందన్నారు. కోతలకు కూలీ చెల్లించలేక రైతులు ఇబ్బందులు పండుతున్నారని ఆవేదన చెందారు.
కవిత ఉండుంటే ఈ గోసలు ఉండేవి కాదని రైతులు బాధపడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మిగిలిపోయిన షటర్ల బిగింపు పనులు చేయాలని, యాసంగి పంటలకు ఇబ్బంది కలుగకుండా చూడాలని డిమాండ్ చేశారు. కవిత హయాంలోనే జగిత్యాల నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని చెప్పారు. ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేందుకు జగిత్యాలలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన ఘనత ఆమెకు దక్కుతుందని కొనియాడారు. బీర్పూర్ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి 30 లక్షల నిధులు కేటాయించారని తెలిపారు. స్థానిక రైతులు అప్పటి ఎంపీ కవితకు రాజుల చెరువు గురించి వివరించి, సామర్థ్యం పెంచాలని కోరగా వెంటనే స్పందించి 65 కోట్లతో ఆధునీకరణ పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. శిలాఫలకాలను ప్రారంభించచడం మాత్రమే ఎమ్మెల్యే చేశారని, నిధుల కోసం కవిత కృషి చేశారని చెప్పారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొల్ముల రమణ, ప్యాక్స్ మాజీ చైర్మన్ మెరుగు రాజేశం, పాయకులు సతీశ్, సుధాకర్, వెంకటేశ్, సుదర్శన్, చంద్రయ్య, అశోక్, రాజన్న, రాజేందర్, పోశాలు, రైతులు పాల్గొన్నారు.