Student unions demand | పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా విద్యాధికారి మాధవి అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగంపై విచారణ జరిపి వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు అమరగాని ప్రదీప్ కుమార్ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట మంగళవారం ఆందోళన నిర్వహించి మాట్లాడారు. ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ పెద్దపెల్లి జిల్లా విద్యాధికారి మాధవి అవినీతి, అక్రమాలపై ఎన్నిసార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.
వెంటనే అవినీతి, అక్రమాలపై విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన రైతు సంఘాల నాయకులు గూడెపు జనార్దన్ రెడ్డి, రాజాం మహంతక్రిష్ణ, రామగిరి మహేందర్, జంగా కిరణ్ రెడ్డి, పంజాల రవీందర్ గౌడ్, వెంకటేశ్వర్లు, కొమ్మ ఐలయ్య, పెద్దోల్లా ఐలయ్య, దాడి రవీందర్, ఆలుబోజు రాజేందర్, దొడ్ల రాజయ్య, తీగల అశోక్ గౌడ్, మేరుగు కనకయ్య, కంచి శ్రీనివాస్, ఎల్లేష్ గౌడ్, అనిల్, గంగిపెల్లి సాగర్ తదిత రులు పాల్గొన్నారు.