Sunke Ravi Shankar | రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది.. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
తెలంగాణ రాష్ట్రంలో రాక్షసర్ పాలన కొనసాగుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతూ పరిపాలన చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ దుయ్యబట్టారు.
Sunke Ravi Shankar | గంగాధర, ఫిబ్రవరి 5 : తెలంగాణ రాష్ట్రంలో రాక్షసర్ పాలన కొనసాగుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతూ పరిపాలన చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ దుయ్యబట్టారు. చొప్పదండి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గంగాధర మండలంలోని బూరుగుపల్లి లోని ఆయన నివాహసంలో పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని బ్రష్టు పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష నేతలను అక్రమ అరెస్టులు చేయిస్తే తప్ప బయట తిరగలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని దుయ్యబట్టారు. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కారని విమర్శించారు. ఎన్నికల సమయంలో తప్ప ముఖ్యమంత్రి కి ప్రజలు గుర్తు రావడంలేదని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ నాయకులను వేధిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. భయపడుతూ ఎన్నాళ్లు రాజకీయం చేస్తారని, ఈ సీరియల్ చూస్తూ ఇంట్లో కాలక్షేపం చేసుకోవాలని హితవు పలికారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

