Godavarikhani | జ్యోతినగర్, మే 31: ఎన్టీపీసీ మేడిపల్లి రోడ్ లో రోడ్డు వెడల్పులో భాగంగా శనివారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. 80ఫీట్ల రోడ్డు వెడల్పులో రోడ్డుకు ఇరువైపుల 40ఫీట్ల చొప్పున మార్కింగ్ ప్రకారం అధికారులు అక్రమ నిర్మాణంగా జేసీబీ సాయంతో దుకాణాల కూల్చివేతను ప్రారంభించారు.
మేడిపల్లి సెంటర్ నుంచి కూల్చివేత చర్యల. ప్రారంభించిన అధికారులు మొదటి రోజును రోడ్డును అనుకోని ఉన్న గద్దెలు, షెడ్లను జేసీబీతో తొలగించారు. మార్కింగ్ ప్రకారం తమ దుకాణాలను తొలగించుకోవాలని మార్ చేసి చూపించిన అధికారులు ఏ మాత్రం సమయం ఇవ్వకుండా హాడావుడిగా జేసీబీతో వచ్చి కూల్చివేతలు ఏమిటని పలువురు దుకాణాదారులు ఆరోపిస్తున్నారు.
కూల్చివేత తొందరపాటు చర్య : సీపీఎం
ఎన్టీపీసీ మేడిపల్లి రోడ్ లో మున్సిపల్ అధికారులు చేపట్టిన కూల్చివేతలు తొందరపాటు చర్యగా సీపీఎం నాయకులు నాంసాని శంకర్, లక్మారెడ్డిలు పేర్కొన్నారు. రోడ్డు వెడల్పుపై శుక్రవారం మార్కింగ్ చేసిన అధికారులు మరుసటి రోజునే కూల్చివేత చర్యలు తీసుకోవడాన్ని ఖండించారు. కనీసం 15రోజుల గడువు ఇవ్వలేదన్నారు. ఎలాంటి నోటీసులు కూడ ఇవ్వకుండా కూల్చివేయడాన్ని ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
రోడ్డు వెడల్పు అభివృద్ధికి ఎవరు అడ్డుకోవడం లేదని, వ్యాపార వర్గాలు, ఇంటి యాజమానులు ముందున్న రేకుల షెడ్లను తొలిగించుకునే సమయం లేకుండా కూల్చివేతలు సరైందికాదన్నారు. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోని నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు రోడ్డు వెడల్పులో దుకాణాలను కోల్పోతున్న బాధిత వ్యాపారులను కలిసి వారి సమస్యను తెలుసుకున్నారు.