కరీంనగర్ విద్యానగర్, మార్చి 20 : పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ ఆశ కార్యకర్తలు డిమాండ్ చేశారు. గురువారం కరీంనగర్ డీఎంహెచ్వో ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లెప్రసీ సర్వే చేస్తున్న ఆశ కార్యకర్తకు ప్రతి సంవత్సరం 1050 చొప్పున ఇవ్వాల్సి ఉందని, 649 ఆశ వరర్స్కి 6,81,450 ఇవ్వాల్సి ఉందన్నారు. ఆశలు ధర్నా వద్దకు వచ్చిన డీఎంహెచ్వో వెంకటరమణ మాట్లాడుతూ బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియదని, వచ్చిన వెంటనే ఆశల ఖాతాలో జమ చేస్తామన్నారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గీట్ల ముకుందరెడ్డి, యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఆర్ శారద, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం శ్రీలత పాల్గొన్నారు.