Hotel Management | కమాన్ చౌరస్తా, మే 12 : శాతవాహన విశ్వ విద్యాలయం పరిధిలో బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో రెండో సెమిస్టర్, ఆరో సెమిస్టర్ పరీక్షలు మే 19 నుంచి ప్రారంభమవుతాయని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సురేష్ కుమార్ తెలిపారు.
పరీక్షలు 19వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు. 2019 – బ్యాచ్ బ్యాక్ లాగ్ విద్యార్థులకు కూడా అవకాశం కల్పించామని చెప్పారు. విద్యార్థులు మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలని లేదా ఆయా కళాశాలలో సంప్రదించాలని సూచించారు. |