Decomposed body | హుజూరాబాద్, సెప్టెంబర్ 20: ప్రభుత్వ దవఖానలో ఫ్రీజర్ పని చేయకపోవడంతో మార్చురీలో మృతదేహం కుళ్లిపోయింది. వివరాల్లోకి వెళితే… శుక్రవారం శంకరపట్నం మండలం కొత్తగట్టులో లారీ డ్రైవర్ కుల్దీపిసింగ్ గుండెపోటుతో మృతి చెందాడు. కాగా అతడి మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వ దవఖానకు తరలించి మార్చురీలోని ఫ్రీజర్లో భద్రపరిచారు. కుల్దీప్ సింగ్ బంధువులు వచ్చి చూసేసరికి మృతదేహాం కుళ్లిపోయి వాసన పట్టింది.
దీంతో బంధువులు దవఖాన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సూపరింటెండెంట్ నారాయణరెడ్డి ఫ్రీజర్ టెంపరేచర్ పని చేస్తున్నట్లు చూపిస్తుందని.. కానీ పనిచేయడం లేదని సంఘటన బట్టి తెలిసిందని పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.